నార్నూర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ( Batukamma Celebrations ) ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించి చిత్తూచిత్తూల బొమ్మ.. శివుడి ముద్దుల గుమ్మా అంటూ మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు ఆడి పాడారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకట కేశవులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చే పండుగని అన్నారు. గౌరమ్మ కృపా, కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ సేవా పథకం అధికారి బాలాజీ కాంబ్లే మాట్లాడారు.
విద్యార్థులు చదువుతోపాటు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటరమణ, ఉదయ్ కుమార్, నరేష్, అజయ్ కుమార్, సుజాత, రచన, వరుణ్ రెడ్డి, జ్వాలెంధర్, సిబ్బంది గజానంద్, కృష్ణవేణి, రుక్మిణి, విద్యార్థులు పాల్గొన్నారు .