Auto Drivers Protest | పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన
Auto Drivers Protest | పెంచిన డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా డిమాండ్ చేశారు.
తాండూర్ : పెంచిన డీజిల్ ధరలను ( Diesel Prices ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ చార్జీలు పెంచడం వల్ల ఆటో డ్రైవర్ల ( Auto Drivers ) బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం తాండూర్ మండల కేంద్రం ఐబీలో ఆటో కార్మికులతో కలిసి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు డీజిల్ ధరలు పెంపుతో ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అయిందన్నారు.
సింగరేణి సంస్థకు, ఆర్టీసీ సంస్థకు ఎలాగైతే సబ్సిడీ ఇస్తున్నారో అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా డీజిల్ ధరలో రాయితీ కల్పించాలని కోరారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే జీఎస్టీలను తగ్గించి రాయితీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం శ్రీనివాస్, అధికార ప్రతినిధి వేల్పుల శంకర్, తాండూరు మండల ఆటో కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

