ఆసిఫాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో ( Panchayat Election ) గెలిచిన, ఓడిన సర్పంచులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో సర్పంచ్‌గా గెలిచిన ఒకరు ఓడిన వ్యక్తి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి చేయగా ఆసిఫాబాద్( Asifabad District) జిల్లాలో ఓడిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థిపై కత్తితో దాడికి ( Attack ) యత్నించారు.
సిర్పూర్( టి ) మండలంలోని ఇటుకల పహాడ్ గ్రామంలో నిన్న జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారురాలు వడాయి తానుబాయి గెలుపొందారు. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన నారా బాయి భర్త భీం రావు సోమవారం గెలిచిన సర్పంచ్ భర్త పోశెట్టిపై పొడవాటి కత్తితో దాడికి యత్నించాడు.
దీంతో కుటుంబ సభ్యులు ఎదురించి భీంరావును పట్టుకుని ఇంటి ముందు తాడుతో కట్టేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు.