Basara Govt school | బాసర, జూన్ 28 : బాసరలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు హల్ చల్ సృష్టించారు. పాఠశాలలోకి చొరబడ్డ ఆకతాయిలు నాలుగు సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతోపాటు రెండు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు.
ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసయ్య మాట్లాడుతూ.. గతంలో సైతం గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నోసార్లు దుశ్చర్యలకు పాల్పడ్డారని, అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద వచ్చిన నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మరోవైపు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని.. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయుడితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం