ఉట్నూరు : గంజాయి మాదకద్రవ్యాలను ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో పూర్తిగా రూపుమాపాలనే దిశగా సబ్ డివిజనల్ పోలీస్ యంత్రంగా విధులు నిర్వర్తిస్తుందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సబ్ డివిజనల్ పరిధిలో గంజాయి పండించిన, అమ్మిన, వ్యాపారం చేసిన సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు సబ్ డివిజనల్ పరిధిలో గత ఐదు నెలల లో 23 కేసులను నమోదు అయ్యాయని, అందులో దాదాపు 50 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో గంజాయిని సబ్ డివిజనల్ పరిధిలో నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు వివరించారు. గంజాయి పై ఎలాంటి సమాచారం ఉన్న 8712659935 నెంబర్ కు సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రజలు గంజాయి వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గంజాయి మాదగ ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.