జైనూర్, జూలై 17: తెలంగాణ ఉద్యమ నాయకుడు కినక యాదవ్రావ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. యాదవ్రావ్ ఇటీవల మరణించగా బుధవారం ఆయన కుటుంబాన్ని మండలంలోని పారా గ్రామంలో ఎమ్మె ల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అతని భార్యకు పోచ్చంలొద్దిలోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
యాదవ్రావ్ కుటుంబానికి ఎల్ల వేళలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు మర్సకోల సరస్వతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్రావ్, పీఏసీఎస్ చైర్మన్ కొడప హన్ను పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్ర భగవంత్రావ్, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్, బీఆర్ఎస్ నాయకులు ఖదీర్ అహ్మద్, విశాల్ కేంద్రె గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.