Indiramma Illu | వాంకిడి, మార్చి 4: ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు వాంకిడి ఎంపీడీవో వీ. ప్రవీణ్‌కుమార్ అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీలోని బోర్డా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మంగళవారం నాడు ఆయన సమావేశమయ్యారు. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన వారు వీలైనంత ఇంటి నిర్మించే స్థలాన్ని ముందు చదును చేసి సిద్ధంగా ఉంచాలని.. త్వరగా ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టాలని సూచించారు. నిర్దేశిత కొలతల ప్రకారం ఇంటి నిర్మాణం చేయాలని.. ఏమైనా సందేహాలు ఉంటే హౌసింగ్ ఏఈని సంప్రదించాలని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు హౌసింగ్ ఏఈ రత్నం మార్కవుట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శరణ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.