Pak vs Ned |టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఆతిథ్యం ఇస్తోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టాస్ అనంతరం మాట్లాడిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పిచ్‌పై తేమ ఉండే అవకాశం ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో బౌలర్లకు అనుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఇది కొత్త పిచ్. పచ్చిక కూడా ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా రాణించే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ మంచి జట్టు. అయినప్పటికీ మా బలాలపై దృష్టి పెట్టి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలం అని పేర్కొన్నారు.
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే తామూ బౌలింగ్ ఎంచుకునే వారమని చెప్పారు. అయితే తొలుత బ్యాటింగ్ చేయడం కూడా సంతోషంగానే ఉందన్నారు. పిచ్ బాగుంది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. తదుపరి దశకు వెళ్లాలంటే కనీసం మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఇది మాకు కీలక మ్యాచ్. శ్రీలంక పరిస్థితులకు మేము అలవాటు పడ్డాం. జట్టులో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు అని వివరించారు.అయితే నెదర్లాండ్స్ జట్టు ధీటుగానే బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో రెండు కీలక వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుంతం నెదర్లాండ్స్ ఐదు ఓవర్లకి గాను రెండు వికెట్స్ కోల్పోయి 36 పరుగులు చేసింది.
పాకిస్తాన్ తుది జట్టు
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), బాబర్ ఆజామ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.
నెదర్లాండ్స్ తుది జట్టు
మైఖేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), జాచ్ లయన్ క్యాచెట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్.
మొత్తంగా చూస్తే, పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ తొలి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ కీలకంగా మారనుంది. రెండు జట్లు కూడా టోర్నీకి శుభారంభం కోసం గట్టి పోరుకు సిద్ధమయ్యాయి.