నేరడిగొండ, ఫిబ్రవరి 22 : ప్రజారోగ్య రక్షణలో శ్రమిస్తున్న ఆశ కార్యకర్తల సేవలు ప్రశంసనీయమని జడ్పీటీసీ జాదవ్ అనిల్ కొనియాడారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, వైద్యాధికారి ఆనంద్‌కుమార్, హెల్త్ సూపర్వైజర్ రాంనరేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్‌లో..
భీంపూర్, ఫిబ్రవరి 22 : ఆశ కార్యకర్తల జీతాలు పెంచి వారి గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో 38 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1500 ఉన్న ఆశ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.7500లకు పెంచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో జ్ఞానేశ్వర్, సర్పంచ్ లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తమ్, సిబ్బంది గంగాధర్, లూసీ, ప్రియాంక, విష్ణు, జనాబాయి, రాందాస్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
జైనథ్‌లో..
జైనథ్, ఫిబ్రవరి 22 : గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యురాలు నిర్మల, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ భోజన్న, నాయకులు పరమేశ్వర్, జావిద్ పాల్గొన్నారు.