కాసిపేట : మంచిర్యాల (Manchiryala ) జిల్లా కాసిపేట మండలంలో గురువారం నిర్వహించే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC election) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి మరో పోలింగ్ కేంద్రాన్ని ( Polling Centre) ఏర్పాటు చేశారు.
పట్టభద్రుల ఎన్నికలకు 48 నెంబర్ పోలింగ్ స్టేషన్లో 461 మంది పురుషులు, 301 మంది మహిళా పట్టభద్రుల ఓట్లు మొత్తం 762 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి 27 నెంబర్ పోలింగ్ స్టేషన్లో పురుషులు 10 మంది , మహిళలు 6గురు మొత్తం 16 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసి విధులను కేటాయించారు.