కాగజ్‌నగర్, జూన్ 19 : మండలంలోని నార్లాపూర్‌లో గురువారం సాగు పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారు లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన రైతులు శంకర్, సోనేరావుకు సంబం ధించి భూములు నార్లాపూర్ గ్రామ శివారులో ఉన్నా యి. ట్రాక్టర్ ద్వారా దుక్కులు దున్నుతుండగా, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు.
రిజర్వు ఫారెస్ట్ భూములు దున్నడానికి వీల్లేదని అడ్డగించగా, రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఏళ్ల తరబడి భూములు సాగు చేస్తున్నామని, రెవెన్యూ శాఖ నుంచి పట్టాలున్నాయని, ప్రభుత్వ పథకాలు సైతం అమలవుతున్నాయని రైతులు స్పష్టం చేశారు. అయినా అటవీ శాఖ అధికారులు వినకుండా అడ్డుకున్నారు. ఏదైన ఉంటే కార్యాలయానికి వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు
అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వీ నర్ లెండుగురే శ్యాంరావు అన్నారు. ఆయన అంకు సాపూర్కు చేరుకొని రైతులతో మాట్లాడి సమస్యలు తె లుసుకున్నారు. రెవెన్యూ పట్టాలున్నా భూముల్లో సాగు చేస్తున్నా అడ్డుకోవడం, కేసు పెడుతామని బెదిరించడం సరికాదని, పట్టా భూముల్లో సాగును అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, గ్రామస్తులు ఉన్నారు.