కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, మార్చి 18 : డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వసతి గృహాల్లో పనిచేసే కార్మికులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెం డో రోజూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గిరిన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు.
పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, జీవో 212ను అనుసరించి 2014 నాటికి ఐదేళ్లు నిండిన కార్మికులను వెంటనే పర్మినెంట్ చే యాలని, కొత్త మెనూ వల్ల పెరిగిన పని భారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, అంగన్వాడీకు కనీస వేతనం పెంచాలని, అర్హత కలిగిన వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశా రు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, లేదంటే ఆం దోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, శ్రీకాంత్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి త్రివేణి, నాయకులు గంగమని, అరుణ, స్వరూప, రాజేశ్వరి,కమల, అంజలి, మల్లేశ్వరి ఉన్నారు.