దండేపల్లి, డిసెంబర్ 31 : మతిస్థిమితం లేని ఓ మహిళ టవరెక్కి హల్చల్ చేసిన ఘటన దండేపల్లిలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన బొడ్డు బక్కవ్వ(55) కొన్నేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నది.
ఆదివారం ఉన్నట్టుండి టవర్ ఎక్కడం ప్రారంభించింది. స్థానికులు వద్దని వారించినా వినకుండా టవర్‌పైకి చేరుకొని కూర్చుంది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని యువకుల సహకారంతో కిందకు దింపారు. కథ సుఖాంతమవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.