నస్పూర్ శివారులోని సర్వేనంబర్-42లో టీఎన్జీవోస్కు కేటాయించిన 32.02 ఎకరాల భూమి వివాదాలకు దారితీస్తున్నది. 2000లో అప్పటి ప్రభుత్వం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగించగా, అందులోనే తమకు సైతం భూమి ఉందంటూ దళితులు కోర్టును ఆశ్రయిం చారు. ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో చివరకు టీఎన్జీవోస్ నేతలు.. అసైన్డ్‌దారులతో చర్చలు జరిపి 2 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందం (అనధికారికంగా) కుదుర్చుకున్నారు.
ఇక ఆ భూమిలో పలువురు ఇంటి నిర్మాణాలు చేపడుతుండగా, సోమవారం అధికారులు వచ్చి కూల్చివేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దళితులు అక్కడికి చేరుకొని గొడవకు దిగారు. ఈక్రమంలో గొడిసెల లవకుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా, అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు హెచ్చరించారు.
– సీసీసీ నస్పూర్, డిసెంబర్ 11
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 11: నస్పూర్ శివారులోని సర్వేనంబర్-42లో టీఎన్జీవోస్కు కేటాయించిన భూమి వివాదాలకు దారితీస్తున్నది. మంచిర్యాల జిల్లా టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి 2000లో అప్పటి ప్రభుత్వం 32.02 ఎకరాలు కేటాయించింది. అందులో కొంత భూమి తమదంటూ నస్పూర్‌కు చెందిన దళితులకు కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి మొదలైనా ఈ వివాదం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇందులో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. వీరికి కేటాయించిన భూమిపై రెవెన్యూ అధికారులు సర్వేలు కూడా చేశారు. ఓ వైపు కోర్టు చిక్కులు, మరోవైపు ఎటూ తేలని భూ కేటాయింపుల వ్యవహారం, ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో టీఎన్జీవోస్ సొసైటీ సభ్యులకు కేటాయించిన భూమిలో నిర్మాణాలు జరుగలేదు.
మంచిర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ భూమికి క్రమేనా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. జాతీయ రహదారిపై ఆనుకుని ఉండడం.. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం సమీపంలోనే కలెక్టరేట్ ఏర్పాటు చేయడంతో భారీగా డిమాండ్ పెరిగింది. వివాదాలు లేకుండా ఉన్న కొంత భూమిలో ఇప్పటికే నిర్మాణాలు జరిగాయి. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో మాత్రం నిర్మాణాలు కాలేదు. ఈ భూమి విషయంలో టీఎన్జీవోస్ నేతలు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. ఈ పంచాయతీ తేలేలా లేదని.. అసైన్డ్‌దారులకు రెండెకరాలు ఇస్తామని టీఎన్జీవోఎస్ అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా.. సోమవారం అసైన్డ్‌దారులకు కేటాయించిన భూమిలో జరుగుతున్న నిర్మాణాలను అధికారులు వచ్చి కూల్చివేశారు. దీంతో ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
నస్పూర్‌కు చెందిన దళిత అసైన్డ్‌దారులు 42 సర్వేనంబర్‌లో టీఎన్జీవోఎస్కు కేటాయించిన భూమిలో తమ భూమి ఉందని 8 నెలల క్రితం రిలేదీక్షలకు దిగారు. దాదాపు 27 మంది లబ్ధిదారులు తమ కుటుంబాలతో వచ్చి దాదాపు 20 రోజుల పాటు దీక్షలు చేశారు. కోర్టులో కేసు ఉండగా.. తమ భూముల్లో బోర్లు వేశారని, ఇంటి నిర్మాణాలు జరుపవద్దని ఆందోళ చేశారు. దీంతో టీఎన్జీవోఎస్ నేతలు, దళిత అసైన్డ్‌దారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరికి చర్చలు ఓ కొలిక్కివచ్చాయి. దళిత అసైన్డ్‌దారులకు రెండు ఎకరాల భూమి కేటాయింపునకు అంగీకరించారు.
దీంతో కోర్టులో ఉన్న కేసును అసైన్డ్‌దారులు ఉపసంహరించుకున్నారు. టీఎన్జీవోస్ నేతలు 42 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమి కేటాయించి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని పలువురు దళిత అసైన్డ్‌దారులు తెలిపారు. భూమి కేటాయింపు తర్వాత ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి పూనుకున్నారు. మున్సిపాలిటీ నుం చి అనుమతుల కోసం తిరిగారు. మున్సిపాలిటీ అధికారులు 10 మందికి ఇంటి నంబర్ ఇవ్వడం తో నిర్మాణాలు ప్రారంభించామని అసైన్డ్‌దారులు తెలిపారు. మున్సిపల్ అధికారులు పనులు చేసుకొమ్మని అనడం.. మధ్య మధ్యలో వచ్చి నిలిపివేయడం చాలా రోజులు జరిగాయని వాపోయారు.
కలెక్టర్ కార్యాలయం సమీపంలోనే ఉండడం.. టీఎన్జీవోస్ భూమిపై వివాదాలు కొనసాగడం, నిర్మాణలపై ఫిర్యాదులు వెల్లడంతో సర్వే పకడ్బందీగా నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ భూమిపై సర్వేలు చేశారు. ఈ సర్వేలో సొసైటీ ద్వారా ప్లాట్లు పొందిన వారు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారి వి వరాలతో పాటు కేటాయించిన భూమిలో ఎన్ని ఇండ్ల నిర్మాణం జరిగిందనే వివిధ అంశాలపై వా రం పాటు సర్వే చేశారు. ఈ ఏడాది ఆగస్టులో భూ సర్వే జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ సమక్షం లో డీఐ గంగాధర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపాలిటీ పోలీస్ ప్రత్యేక బృందంతో సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు సంబంధించిన నివేదిక ఇంత వరకు బయటకు రాకపోవడం గమనార్హం.
ఈ భూమి విషయంలో ఆది నుంచి వివాదా లు వెంటాడుతున్నాయి. ఈ భూమిపై దాదాపు 13 కేసులు హైకోర్టులో కొనసాగగా, ఇందులో 4 కేసులు పరిష్కారం అయ్యాయి. అటు సొసైటీ బా ధ్యులు, ఇటు రైతులు న్యాయస్థానం చుట్టూ తిరిగారు. ఈ భూమి చుట్టు పక్కల కొంత వరకు క బ్జాకు గురికావడంతో ఈ వివాదాలకు మరింత ఆ జ్యం పోసినట్లయ్యింది. ప్రస్తుతం టీఎన్జీవోస్కు కేటాయించిన కొంత భూమి వివాదం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఎన్ని సర్వే లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. నిత్యం వి వాదాలు నెలకొంటుండడంతో అధికారులకు ఏ మీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.
టీఎన్జీవో స్ హౌసింగ్ సొసైటీలో దాదాపు 350 మంది వర కు సభ్యులు ఉన్నారు. మొదటి దఫాలో వివాదా లు లేని భూమిని 130 మందికి కేటాయించి ప్లా ట్లు ఇచ్చారు. ఇందులో చాలా మంది ఇండ్లు ని ర్మించుకున్నారు. ఈ మధ్యనే రెండో విడుతలో 120 ప్లాట్లు సిద్ధం చేసి బోర్లు కూడా వేశారు. ఇం డ్ల నిర్మాణాలకు అనుమతులు లేవని నిలిపివేశా రు. దీంతో కేటాయించిన సొసైటీ సభ్యులు మున్సిపాలిటీలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇందులో కొంత మంది లబ్ధిదారులు చనిపోగా, మరికొంత మంది ఇతరులకు అమ్ముకున్నారు.
తాజాగా సోమవారం ఉదయం నస్పూర్ సర్వేనంబర్ 42 కూల్చివేతల పర్వం కొనసాగింది. దళిత అసైన్డ్‌దారులతో టీఎన్జీవోస్ నేతలు చేసుకున్న ఒప్పందం ప్రకారం కేటాయించిన 2 ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్, నస్పూర్ తహసీల్దార్ వనజారెడ్డి, సీఐ తోట సంజీవ్, ఎస్ఐ రవికుమార్ పర్యవేక్షణలో సర్వేనంబర్ 42, 52 ప్రభుత్వ భూమిలో నిర్మించిన 12 ఇండ్లు, ఒక ప్రహరీని కూల్చివేశారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేసి అధికారులను నిలదీశారు.
కూల్చివేతల సమయంలో నస్పూర్‌కు చెందిన గొడిసెల లవకుమార్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఎస్ఐ రవికుమార్ గమనించి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి గొడవలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు మాట్లాడుతూ సర్వేనంబర్ 42, 52, 64లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీపీఎస్ సతీష్, టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.