ఇచ్చోడ, జనవరి 22 : బోథ్ నియోజక వర్గంలోని గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ ఇక నుంచి బీటీ రహదారులుగా కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఆయా గ్రామాల్లోని రోడ్ల నిర్మాణం పూర్తయితే రహణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. రైతులు పంట పొలాలకు వెళ్లే దారి ఏర్పడుతోంది.
బోథ్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం, గిరిజన శాఖ రూ.42.29 కోట్లు మంజూరు చేసింది. వీటితో 40 రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. తలమడుగు మండలం ఝరిపునగూడ నుంచి రత్నాపూర్ రోడ్డుకు రూ.4 కోట్లు, ఉమ్రి నుంచి గోగరివాడి రోడ్డు, వంతెనకు రూ.4 కోట్లు, లక్ష్మీపూర్ నుంచి లాల్గఢ్ రోడ్డుకు రూ.48 లక్షలు, తాంసి మండల గిరిగాం నుంచి రాంనగర్ రోడ్డుకు రూ.1.20 కోట్లు, గుబ్డిపల్లి నుంచి కొజ్జన్గూడ రోడ్డుకు రూ.1.60 కోట్లు, కప్పర్ల నుంచి చింతపల్లి రోడ్డుకు రూ.1.16 కోట్లు, గోవింద్పూర్ నుంచి జెండాగూడ రోడ్డుకు రూ.1.60 కోట్లు, నేరడిగొండ మండలం రాజురా నుంచి సక్రియాతండా రోడ్డుకు రూ.1.20 కోట్లు, జాతీయ రహదారి నుంచి నంద్యాతండా రోడ్డుకు రూ.96 లక్షలు, జాతీయ రహదారి నుంచి
కిష్టాపూర్ రోడ్డుకు రూ.35 లక్షలు, వెంకటాపూర్ నుంచి కుంటాల(బీ) రోడ్డుకు రూ.88 లక్షలు, కుమారి నుంచి గాజిలి రోడ్డుకు రూ.1.05 కోట్లు, ఆర్అండ్బీ నుంచి సవర్గాం రోడ్డకు రూ.21 లక్షలు ఆర్అండ్బీ నుంచి పట్పటితండా రోడ్డుకు రూ.11 లక్షలు, జాతీయ రహదారి నుంచి శంకరాపూర్ రోడ్డుకు రూ.53 లక్షలు, బోథ్ మండలం ధన్నూర్(బీ) నుంచి నాగాపూర్ రోడ్డుకు రూ.2.10 కోట్లు, పీఆర్ రోడ్డు నుంచి నక్కలవాడ రోడ్డుకు రూ.12 లక్షలు, పార్డీ(కే) నుంచి మామిడిగూడ రోడ్డుకు రూ.25 లక్షలు, మర్లపెల్లి నుంచి రేండ్లపల్లె రోడ్డుకు రూ.1.43 కోట్లు, బజార్హత్నూర్ మండలం భూతాయితండా నుంచి డెడ్రా వరకు రోడ్డుకు రూ.1.75 కోట్లు,
భూతాయి(కే) నుంచి ఉమర్డా రోడ్డుకు రూ.3.77 కోట్లు, భూతాయి(కే) నుంచి గిర్జాయి రోడ్డుకు రూ.53 లక్షలు, గుడిహత్నూర్ మండలం గర్కంపేట నుంచి పాత గర్కంపేట రోడ్డుకు రూ.1.60 కోట్లు, తోషం ఆర్అండ్బీ నుంచి బొర్రమద్ది రోడ్డుకు రూ.41లక్షలు, తోషం నుంచి తోయగూడ రోడ్డుకు రూ.32 లక్షలు, శాంతాపూర్ నుంచి తేజాపూర్ రోడ్డుకు రూ.1.16 కోట్లు, మన్నూర్ నుంచి భీంపూర్ రోడ్డుకు రూ.46 లక్షలు, ఇచ్చోడ మండలం ఎల్లమ్మగూడ నుంచి జెండాగూడ రోడ్డుకు రూ.1.23 కోట్లు, ఆర్అండ్బీ నుంచి పాండుగూడ రోడ్డుకు రూ.1.05 కోట్లు, సిరికొండ మండలం సిరిచెల్మ నుంచి నారాయణపూర్ రోడ్డుకు రూ.49 లక్షలు, బజార్హత్నూర్ మండలం డెడ్రా నుంచి మాన్కాపూర్ రోడ్డుకు రూ.70 లక్షలు, ఇచ్చోడ మండలం మల్యాల నుంచి పెద్ద
సల్యాద రోడ్డుకు రూ.1.05 కోట్లు, ముక్రా(కే) నుంచి గోండుగూడకు రూ.77 లక్షలు, పంచాయతీ రోడ్డు నుంచి మనుకుగూడకు రూ.20లక్షలు, గేర్జం రోడ్డు నుంచి జల్దాకు రూ.38లక్షలు, నేరడిగొండ మండలం కొర్టికల్(బీ) నుంచి ధన్నోరా(డీ) రోడ్డుకు రూ.43 లక్షలు, బజార్హత్నూర్ మండలం రాంపూర్ నుంచి లక్ష్మణ్ నాయక్తండా రోడ్డుకు రూ.39 లక్షలు, ఇచ్చోడ మండలం ముక్రా(బీ) నుంచి మాన్కుగూడ రోడ్డుకు రూ.67 లక్షలు, మల్యాల నుంచి చిన్న సల్యాద రోడ్డుకు రూ.77 లక్షలు, మాన్కాపూర్ నుంచి జోగిపేట గాయిద్పల్లె రోడ్డుకు రూ.95 లక్షలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.