న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..3 సిరీస్‌లో భాగంగా సరికొత్త మాడల్‌ను తీసుకొచ్చింది. ఎనిమిదో జనరేషన్గా విడుదల చేసిన ఈ పెట్రోల్ మాడల్తోపాటు రెండు ఎలక్ట్రిక్ మాడళ్లు కూడా ఉన్నాయి. వీటిలో హైబ్రిడ్ మాడల్ ఐ3 ఏకంగా 912 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
పెట్రోల్‌తోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీతో తీర్చిదిద్దింది. కేవలం 4.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. సింగిల్ చార్జింగ్‌తో 423 కిలోమీటర్లు, పెట్రోల్‌తో మరో 500 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ప్రస్తుతానికి ఈ కారు ధర ప్రకటించలేదు.