హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దోహా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు రూ.24.5కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగేజీలో కొకైన్ ఉందన్న సమాచారం మేరకు బుధవారం అతడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు.
ఈ క్రమంలో 387 గ్రాముల బరువుగా పేర్కొన్న ఏడు డార్క్ చాక్లెట్ ట్యూబ్‌లను అతని బ్యాగులో గుర్తించారు. అధికారులు తెరిచి పరిశీలించగా చాక్లెట్లతో పాటు దాచిన 207 క్యాప్సూల్స్ బయటపడ్డాయి. ఈ మేరకు 4.9 కిలోల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ సుమారు రూ.24.5కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు.