అయోధ్యంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆసిఫాబాద్, సిర్పూర్(యు), రెబ్బెన, కెరమెరి, కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, బెజ్జూర్, మండలాల్లోని రామాలయాలు, హనుమాన్ ఆలయాలకు భక్తు లు పోటెత్తారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామాలన్నీ రామ నామ స్మరణతో మార్మోగాయి. పలు చోట్ల హనుమాన్ చాలీసా పఠించారు.
ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సా యంత్రం భజనలు నిర్వహించారు. ఎస్పీ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తిర్యాణి మండలంలోని ఏదులపాడ్ గ్రామానికి చెందిన ఆత్రం సచిన్ అయోధ్య రామ మందిర దర్శన యాత్రను సైకిల్ ద్వారా ప్రారంభించాడు. ముందుగా ఏదులపాడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు.
-నెట్ వర్క్