బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం రాంనగర్ గ్రామంలో మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలు.. ఎస్సై అప్పారావు వివరాల ప్రకారం.. రాంనగర్ గ్రామానికి చెందిన గంగారాం (54)అనే వ్యక్తి గత కొంత కాలంగా మద్యానికి బానిసై ( Alcohol addict) జీవితంపై విరక్తి చెందాడని తెలిపారు. శనివారం మధ్యాహ్నం గ్రామంలోని పంట పొలం లో చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ఈ మేరకు మృతుని కుమారుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.