జైనూర్, ఆగస్టు 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం పార్వతి తమకు వద్దంటూ విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు. గేటు ముందు బైఠాయించి ఇప్పటి వరకున్న ఇన్చార్జి హెచ్ఎం సోనేరావ్నే తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెస్రం ఆంబాజీరావ్ పాఠశాలను సందర్శించి విద్యార్థినులను సముదాయించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకున్నా, ఇతరాత్ర మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించబోమన్నారు. హెచ్ఎం వద్దంటూ ఆందోళనకు దిగడం సరికాదని పిల్లలకు నచ్చజెప్పి తరగతి గదులకు పంపించారు.
పాఠశాలను సందర్శించిన డీడీ
హెచ్ఎం మాకొద్దంటూ ఆందోళనకు దిగిన వి షయం తెలుసుకున్న కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లా డీడీ రమాదేవి పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు ఆందోళనకు దిగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బో ధన సిబ్బంది, వర్కర్లు విధి నిర్వహణలో స మయపాలన పాటించాలన్నారు. విద్యార్థిను లు క్రమ శిక్షణ అలవర్చుకోవాలని సూచించా రు. అకారణంగా పిల్లలను ఎవరైనా రెచ్చగొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.