ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ టికెట్ అజ్మీరా శ్యాంనాయక్‌కు కేటాయిం చడంపై సీనియర్ నాయకులు మర్సుకోల సరస్వతి, గణేశ్ రాథోడ్ శనివారం ధర్నా నిర్వహించారు. పారాచ్యూట్ హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన తర్వాత అగ్గిరాజుకుంటు న్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా.. అందులో ఒక్క స్థానాన్ని మాత్రమే బీసీలకు కేటాయిం డంతో అట్టుడుకుతున్నది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు సీట్లు ఇస్తామని ప్రకటించిన హస్తం పార్టీ ఒక్క సీటుతోనే సరిపుచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాలుగు సీట్లు ఇచ్చి గౌరవించింది. బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో సీటును మహిళకు కేటాయించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. పారా చ్యూట్ నేతలకూ టికెట్లు ఇవ్వడంపై హస్తం నేతలు మండిపడుతు న్నారు. శనివారం ఆసిఫాబాద్, ముథోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేశారు.
– మంచిర్యాల, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరావు పటేల్‌ను అధిష్టానం ప్రకటించడంపై కిరణ్ కొమ్రేవార్ అనుచరులు పార్టీ ఆఫీసులో నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కిరణ్ కొమ్రేవార్కు టికెట్ కేటాయించకుండా అన్యాయం చేసిందని, త్వరలో తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
మంచిర్యాల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అనేక తర్జన భర్జనలు, తండ్లాటల తరువాత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మి ది స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. కాకపోతే నీతులు చెప్పేందుకే కానీ తాము పాటించడానికి కాదన్నట్లు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామన్న ఉదయిపూర్ డిక్లరేషన్‌ను అస్సలు పరిగణలోకే తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా.. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, సిర్పూర్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలన్నీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.
కాంగ్రెస్ లెక్క ప్రకారం చూసుకుంటే ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో రెండు స్థానాలు, పెద్దపల్లి ఎంపీ పరిధిలో రెండు స్థానాలు బీసీలకు ఇవ్వాలి. ఈ లెక్కన కనీసం రెండు లేదా మూడు స్థానాలు ఉమ్మడి జిల్లాలో బీసీలకు పోవాలి. కానీ.. ముథోల్‌లో మాత్రమే నారాయణరావు పటేల్‌కు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. దీంతో టికెట్ వస్తోందని ఆశ పెట్టుకొని, పార్టీ కోసం కష్టపడిన బీసీలందరూ పెదవి విరుస్తున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంథని, రామగుండం, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్, సిర్పూ ర్ నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చింది. ఈ లెక్కన బీసీల పక్షాన ఉంది బీఆర్ఎస్ తప్ప, కాంగ్రెస్ కాదనే చర్చ జోరందుకుంది.
పది స్థానాల్లో ఒక్క మహిళకు కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించడం, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో టికెట్లలో ప్రాధాన్యం ఇస్తారనుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉమ్మడి జిల్లాలో ఒక సీటును మహిళలకు ఇచ్చారు. అదే స్ట్రాటజీలో కాంగ్రెస్ కూడా టికె ట్ ఇస్తుందనుకున్నారు. ఖానాపూర్ రేఖానాయక్, ఆసిఫాబాద్‌లో మర్సుకోల సరస్వతి, ఆదిలాబాద్‌లో గండ్రత్ సుజాత, చెన్నూర్‌లో రామిండ్ల రాధి క టికెట్ ఆశించారు. కానీ.. వీరెవరికీ టికెట్ ఇవ్వలేదు. దీనిపై కాంగ్రెస్ మహిళా నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌లో మర్సుకోల సరస్వతి, మరో ఆశావహుడు గణేశ్ రాథోడ్‌లో కలిసి జిల్లా కేంద్రంలోనే రాస్తారోకో చేశారు. సరస్వతి ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీ తనకు అన్యా యం చేసిందని చెప్పారు.
ఆదివాసీ పోరాట యోధు డు కుమ్రం భీం పుట్టిన ఆసిఫాబాద్‌లో ఆదివాసులను కాదని నాన్‌లోకల్ శ్యామ్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు కాంగ్రె స్ లో పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వకుండా దొం గ, మోసగాడు, అవినీతి పరుడైన ఆయనకు ఎలా టికెట్ ఇస్తారంటూ మండిపడ్డారు. మహిళల మీద కాంగ్రెస్‌కు ఉన్న గౌరవం ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడమేనా చెప్పాలంటూ నిలదీశారు. పని చేసుకోండి అని నాకు చెప్పిన రేవంత్‌రెడ్డికి నేను ఎందు కు గుర్తులేనో చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆ శించిన రేఖానాయక్ ఆమె భర్త ఆసిఫాబాద్ అభ్యర్థి శ్యామ్ నాయక్ కోసం, ఆదిలాబాద్‌లో సుజాత పార్టీ కోసం మౌనంగా ఉన్నప్పటికీ, టికెట్ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
అతీగతీ లేని కాంగ్రెస్ పార్టీ కోసం ఉమ్మడి జిల్లాలో ఏండ్లుగా కష్టపడి పని చేస్తున్న వారిని కాదని, ఇటీవల పార్టీల్లో చేరిన నాయకులకు టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందే పార్టీలో చేరిన శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్, కంది శ్రీనివాస్‌రెడ్డికి ఆదిలాబాద్, నారాయణరావు పటేల్‌కు ముథోల్ టికెట్లు ఇచ్చారు. వీరంతా కొన్ని నెలల ముందే కేవలం టికెట్ ఆశించి మాత్రమే పార్టీలో చేరారు.
దీంతో ఈ నియోజకవర్గాల్లో ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆసిఫాబాద్‌లో మర్సుకోల సరస్వతి, గణేశ్రాథోడ్, ఆదిలాబాద్‌లో గండ్రత్ సుజాత, సాజిథ్ ఖాన్, సంజీవ్‌రెడ్డి, ముథోల్‌లో కిరణ్ కామ్రేవార్ ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చారు. వారికి తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యాంనాయక్‌కు, కంది శ్రీనివాస్‌రెడ్డిలకు టికెట్లు ఇవ్వొద్దంటూ ఏకంగా గాంధీ భవన్‌కు ముందు ధర్నాలు, నిరసలు చేశారు. ఇవేవి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం వీరికి మింగుడు పడడం లేదు.
ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. ముథోల్‌లో నల్ల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపితే, ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక టికెట్ ప్రకటించని చెన్నూర్‌లో పొత్తుల్లో భాగంగా సీపీఐకి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారంతా సింగిల్ రేబల్ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తమను కాదని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వివేక్‌కు టికెట్ ఇస్తే మూకుమ్మడిగా వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ప్రతి నియోజకవర్గంలో అసమ్మతులు, వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీ కుతకుతలాడిపోతున్నది.