బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
- కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి
- ముఖ్య నాయకులతో సమావేశం
- కష్టపడితే విజయం తథ్యం
- ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు
ఆసిఫాబాద్, మార్చి23 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పట్టుగొమ్మలని, పల్లెలో ప్రతిరోజూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీని వీడే అవకాశవాదులతో ఎలాంటి నష్టం లేదని, వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ పార్లమెంట్ నియోజవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమని స్పష్టం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని, మనం చేయాల్సిందల్లా ప్రతి ఓటరును కలిసి కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించడమేనన్నారు.
కాంగ్రెస్ 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని, ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసింది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, జడ్పీటీసీలు అజయ్, దుర్పాతాబాయి, ఎంపీపీలు మల్లికార్జున్‌యాదవ్, సౌందర్య, మోతీరాం, నాయకులు మార్సుకోల సరస్వతి, బుర్సు పోచయ్య, గంధం శ్రీనివాస్, ఇంతియాజ్‌లాలా, అబ్దుల్లా, అలీబిన్‌హైమద్, రవి, ఎత్తేశ్యాం, సంజీవ్, హైమద్ పాల్గొన్నారు.
ఎంపీగా ఆత్రం సక్కును గెలిపించుకుందాం
- బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు
ఆసిఫాబాద్, మార్చి 23 : బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించుకుందామని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అరిగెల నివాసానికి వెళ్లిన ఆత్రం సక్కు తన గెలుపునకు సహకరించాలని కోరా రు. అరిగెల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలంగా ఉందని, నాయకులు మాత్రమే పార్టీలు మారుతున్నారని, ప్రజలు బీఆర్ ఎస్ పార్టీ వైపే ఉన్నారన్నారు.
గతంలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచి పోయాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సౌమ్యు డైన ఆత్రం సక్కుకే జై కొట్టాలని కోరారు. అనంతరం ఆత్రం సక్కు, అరిగెల ఒకరినొకరు సన్మానించుకు న్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కేస్లాపూ ర్ వీరాంజనేయా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, నాయకులు నిసార్, భీమేశ్, ప్రణయ్, బాబురావు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

