సిర్పూర్(టీ), మే 11 : ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సక్కును గెలిపించాలని శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిర్పూర్(టీ) మండలకేంద్రంలో ఇంటింటా ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్ములే కిశోర్, అస్లాం, నర్గేవార్ రాజు, తరుణ్, లక్ష్మణ్, ఫహాద్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారం, మే 11 : ఆదిలాబాద్ ఎంపీగా అభ్యర్థి ఆత్రం సక్కును మెజార్టీతో గెలిపించాలని, మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరుతూ మండలంలోని హాస్టల్ తండా, బంగారు తండా, కవ్వాల్, పొనకల్, రాంపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, జిల్లా అధికార ప్రతినిది భరత్‌కుమార్, ఫజల్‌ఖాన్, మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, సులువ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, మే 11 : మండలంలోని చిర్రకుంటలో ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అహ్మద్, ఉద్యమ గాయకుడు ఇర్ఫాన్, నాయకులు నిసార్, చిలువేరు వెంకన్న, తారిక్, సాజిద్, అమర్ బిన్ అహ్మద్, ఇస్లాం, రవి, అహ్మద్, కార్తీక్, శైలేందర్, సుప్రజ, ఉమ, లలిత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి,మే 10: వాంకిడిలో శివ కేశవ్ నగర్,లక్ష్మీనగర్, కేబీనగర్, అబేద్కర్ నగర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వాంకిడి జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్, బండే తుకా రాం, అశోక్ మహుల్కర్,రాకేశ్, కమలాకర్,అశుతోష్, సంతోష్, రఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూర్, మే 11 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో చివరి రోజున బీఆర్ఎస్ నాయకులు ఆత్రం సక్కు గెలుపుకోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంద్రం పుష్పలత, మాజీ ఎంపీటీసీ నాయిని భాగ్య, నాయకులు ఖాజా సమీయుద్దీన్, సామల రాజన్న, రంగు సురేశ్ గౌడ్, మెర్గు రమేశ్, మెర్గు మహేశ్, రౌతు లచ్చన్న, షణ్ముఖ, తేలి రాజేశ్, డబ్బ ప్రకాశ్ పాల్గొన్నారు.
రెబ్బెన, మే 11 : ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, మహిళ మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, కో ఆప్షన్‌మెంబర్ జౌరోద్దీన్, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావు ఉన్నారు.
కెరమెరి, మే 11: మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.