బజార్ హత్నూర్: పర్యావరణాన్ని ( Environmental) పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ( MP Nagesh ) సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సం ( World Environment day ) సందర్భంగా సొంత గ్రామమైన జాతర్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూల మొక్కలు, గ్రామంలోని పలు వీధులలో మండల నాయకులు గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందర , పంట పొలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు మొక్కలు నాటడం మంచి అలవాటని అన్నారు. జాతర్ల గ్రామంలో ప్రతి ఇంట చెట్లు ఉంటాయని, గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, మాజీ జడ్పీటీసీ తాటిపల్లి రాజు, సహకార సంఘం చైర్మన్ వెంకన్న, అల్కే గణేష్, సూది నందు, అడ్వకేట్ రాములు, సూది వినాయక్ ,చంద్రకాంత్, వెంకటస్వామి ,మాజీ సర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Read also |
వియత్నాంలో కాగజ్నగర్ యువకుడు మృతి