Kaghaznagar | ఆదిలాబాద్ : కాగజ్‌నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన అర్షిద్ అశ్రిత్(21) బుధవారం వియత్నాం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మార్కెట్ ఏరియాలో బట్టల దుకాణం నిర్వహిస్తున్న అర్జున్‌కు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. వియత్నాంలోని తన ఇంటి నుంచి స్నేహితుడితో కలిసి 150 సీసీ బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి గోడను ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అశ్రిత్ స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అశ్రిత్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.