సీసీఐపై ఆగస్టులోగా వైఖరి వెల్లడించాలి
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) పునఃప్రారంభించే విషయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్ ఆగస్టు 31 లోగా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని లేదంటే తాను ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
- బీజేపీ మంత్రుల హామీలు ఏమైనయ్?
- సిమెంట్ పరిశ్రమపై ఎంపీ, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు
- యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
- మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్, జూలై 17 ( నమస్తే తెలంగాణ) : మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) పునఃప్రారంభించే విషయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్ ఆగస్టు 31 లోగా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని లేదంటే తాను ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ ప్రారంభమైతే సుమారు 5వేల నుం చి 6 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం తాను ప్రా ణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో సీసీఐని ప్రారంభించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఢిల్లీలో కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశామన్నారు. టీఎస్ఐ పాస్‌లో రాయితీలు కల్పించడంతో పాటు 51:49 విధానం లేదా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనే ప్రతిపాదనలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదని తెలిపారు. సీసీఐ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, సాధనకమిటీ సభ్యులు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిస్తే స్థానిక ఎమ్మెల్యే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రుల హామీలు ఏమైనయ్ ?
2018 ఎన్నికల్లో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా, గతంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్ గంగారం సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇ చ్చినా ఎలాంటి ఫలితం లేదన్నారు. యువత ఓట్ల తో గెలిచిన ఎమ్మెల్యే వారికి ఉపాధి కల్పించే విషయాన్ని పక్కనపెడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కమిషన్లపై దృష్టి సారిస్తూ వేలాది మంది యువత కల్పించే సీసీఐని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నా బీ జేపీ ఎంపీ, ఎమ్మెల్యే లు కనీసం స్పందించ డం లేదని తెలిపారు. సీ సీఐ స్క్రాప్ టెండర్లను చ ట్టవిరుద్ధంగా జరిపారని, గతంలో ఈ టెండర్లను తా ము అడ్డుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐని తిరిగి ప్రారంభించే బాధ్యత ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉందన్నారు. గడువులోగా స్పష్టమైన వైఖరి రాకపోతే సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నా యకులు నారాయణ, అజయ్, సా జిదొద్దీన్, రాజన్న, బట్టు సతీశ్, రమేశ్, పరమేశ్వర్, సురేందర్, ఆసిఫ్, అశోక్, అనిల్, దయానంద్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

