ఆదిలాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పండుగల వేళ ప్రజలు వంట గ్యా స్కు ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటలతోపాటు రుచికరమైన భోజనం చేసుకొనేవారికి గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,05,256 గృహ వినియోగదారుల సి లిండర్ కనెక్షన్లు ఉండగా.. 1,64,465 సింగిల్ సిలిండర్లు, 40,785 డబుల్ సిలిండర్లు ఉన్నాయి. జిల్లాలో రోజు 2600 సిలిండర్లు గృహావసరాలకు సరఫరా చేస్తారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొ రత కనిపించకపోయినా.. ఆదిలాబాద్ పట్టణంలో ని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీలో మాత్రం సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా ఏజెన్సీ ఎదుట బారులదీరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ సిలిండర్ వినియోగదారులు ఎక్కువగా ఉండడంతో గ్యాస్ అయిపోగానే వారు నిండు సిలిండర్ తీసుకుంటారు. సింగిల్ ఉన్న వారు ఖాళీ బుడ్డీలతో గ్యాస్ కోసం తిరుగుతున్న వారికి దొరకడం లేదు. తిరుపెల్లిలో గ్యాస్ ఏజెన్సీలో శుక్రవారం సిలిండర్ల కో సం వచ్చిన వినియోగదారులకు రసీదులు ఇచ్చిన నిర్వాహకులు ఉద యం రావాలని సూచించారు.
శనివారం రసీదులు తీసుకొని జనం రా గా.. వారికి గ్యాస్ లోడ్ వాహనం రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగారు. సోమవారం భారీ సంఖ్యలో ప్రజలు రాగా వారికి కార్యాల యం మూసివేసి నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది. దీంతో మరోసారి వా రికి గ్యాస్ సిలిండర్ దొరకలేదు. మంగళవారం కూడా భారీగా జనం ఖా ళీ సిలిండర్లతో ఏజెన్సీ ఎదుట క్యూ కట్టారు. నాలుగు రోజుల కిందట రసీదులు ఇచ్చిన వారికి నిర్వాహకులు సిలిండర్లు అందించారు.
మిగతావారు బుధవారం రావాలని సూచించారు. దీంతో ప్రజలు ఏమి చేయలేక ఖాళీ బుడ్డీలతో వెనుదిరిగారు. అధికారులు జిల్లాలో గ్యాస్ కొరత లేదని అంటున్నా.. తమకు సిలిండర్లు మాత్రం దొరకడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో తిప్పులు పడాల్సి వస్తున్నదని అంటున్నారు. పండుగల సమయంలో సిలిండర్లు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.