బేల,అక్టోబర్12: సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని పోనాల, పాటన్ ,ఖోగ్దూర్, మంగ్రూడ్ తదితర గ్రామాల్లో మంగళవారం స్థానిక కలిసి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గంభీర్, సతీశ్ పవార్, సంతోష్, జక్కుల మధుకర్, మంగేశ్, ప్రమోద్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 12 : బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా చీరెలు పంపిణీ చేస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏటా బతుకమ్మ సంబురాలకు చీరెలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. మహిళలను గౌరవిస్తూ వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి సాయి, మహిళలు పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 12: పిప్పల్‌ధరి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బండారి శ్రీధర్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి రజిత, ఐకేపీ సీఏ గంగామణి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్12 మండంలోని భిక్కుతండా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆడే విజయ మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.