హాజీపూర్, జూలై 17 : హాజీపూర్ మండలం గఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంసీసీ దుర్గాదేవి జాతర, 51వ ఆలయ వార్షికోత్సవం ఆదివా రం నిర్వహించారు. యేటా ఆషాఢ మాసంలో ఏ దో ఒక ఆదివారం దుర్గాదేవి జాతర నిర్వహించ డం ఆనవాయితీగా వస్తున్నది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు, నైవేద్యాలను సమర్పించి ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ మొక్కుకున్నారు. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలకు పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అ ల్పాహారం పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరుగకుండా మంచిర్యాల ఇన్చా ర్జి డీసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్వంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ నారాయణ నాయక్ భారీ బందోబస్తు నిర్వహించారు.
ఎమ్మెల్యే, ఎంపీ పూజలు
ఎంసీసీలోని క్వారీ దుర్గాదేవి జాతర, దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మె ల్యే దివాకర్‌రావు దంపతులు, పెద్దపెల్లి ఎంపీ వెం కటేశ్ నేతకాని, గఢ్‌పూర్ సర్పంచ్ లక్ష్మి, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు విజిత్‌రావు, మా జీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజ లు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ, రూరల్ సీఐ సంజీవ్, మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముకేశ్ గౌడ్, మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు.