
లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృతి వనానికి మంగళవారం భూమి పూజ చేశారు. సుమారు పదెకరాల స్థలంలో రూ. 40 లక్షల నిధులతో చేపట్టనున్న హరితవిప్లవానికి 31 వేల మొక్కలు నాటేందుకు గ్రామస్తులంతా సమాయత్తమయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు ముందుకు వచ్చారు.
ఆలయాల నిర్మాణానికి నిధులు
అవర్గా, రాయపూర్ కాండ్లిలో బీరప్ప ఆలయాల నిర్మాణానికి రూ. 10 లక్షల చొప్పున, లోకేశ్వరంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ. 12 లక్షలు, సేవాలాల్ తండా జగదాంబ ఆలయ నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ భోజవ్వ, గంగాధర్, ఎంపీటీసీ దత్తు, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, ఎంపీడీవో గంగాధర్, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఏపీవో నవీన్, నాయకులు చిన్నారావు, కరిపే శ్యామ్సుందర్, సుదర్శన్ రెడ్డి, దార్వాడి కపిల్, నాలం గంగాధర్, సాయా రెడ్డి, దిగంబర్, బండి ప్రశాంత్, దడిగే రాజేశ్వర్, ఈజీఎస్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
మండలంలోని లింబా (కే)లో హనుమాన్ ఆలయ నిర్మాణానికి రూ. 27 లక్షలు మంజూ రు కాగా గ్రామస్తులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఆయన నివాసంలో సన్మానించారు. హనుమాన్ చిత్రపటాన్ని అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో ఆలయాల అభివృద్ధికి దశల వారీగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆత్మచైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, సర్పంచ్ ఆనంద్రావ్ పటేల్, ఎంపీటీసీ సత్యం గిరీశ్, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
పరామర్శ
పార్డి(కే) గ్రామంలో ఇటీవల మృతి చెందిన సాతం బుచ్చక్క(భోజాబాయి) కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సర్పంచ్లు ఆకుల గంగాధర్, ముజాహిద్ ఖాన్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సాతం నందకుమార్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, నాయకులు ఎన్నిల అనిల్, బొప్ప నాగలింగం, పీ విజయ్ కుమార్, సహకార సంఘం మాజీ చైర్మన్ మాన్కర్ సురేశ్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, సాతం రవికుమార్ ఉన్నారు.