ఎదులాపురం, జూన్ 22 : ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండూరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఇంద్ర, ఉపాధ్యక్షుడు చేతన్‌కుమార్, సభ్యులు విమల, సాగర, జావిద్ జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ సఫ్దర్ ఆలీ చైర్మన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ సాజిదొద్దీన్, మర్సుకోల తిరుపతి, జాడి సుధాకర్, మోహన్, రఘు, రాము ఉన్నారు.
నార్నూర్, జూన్ 22 : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు, సిబ్బంది జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కనక సేవంతబాయి ప్రభాకర్, మడావి కైలేశ్వరీసాగర్, నాయకులు ఆడా శ్రీరామ్, రాథోడ్ సుభాష్, మెస్రం మానిక్రావ్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 22 : మండలంలోని వేణునగర్లోని సాయి మందిరం, కుమ్మరితండాలోని విఠల్ రుక్మాబాయి మందిరంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేణునగర్‌లో గ్రామస్తులు జన్మదిన వేడుకలు నిర్వహించారు.