సారంగాపూర్, జూన్ 8 : తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపమే మారిపోతున్నదని రాష్ట్ర అ టవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని హన్మాన్తండాలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, మన తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లేవన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రభుత్వంపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజన ప్రజలకు పోడువ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.
అనంతరం హన్మాన్తండాలో గొర్రెలు, మేకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నట్టల నివారణ మందు వేశారు. సర్పంచ్ పవార్ రాజేశ్ కుమార్తె సాక్షి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేక్‌కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. వి ద్యార్థినులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హరితహారంలో మంత్రి మొక్క నాటా రు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లావెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆల య కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ రాజేశ్, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, ఇన్చార్జి ఆర్డీ వో తుకారాం, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఎంపీడీ వో సరోజ, ఎంపీవో తిరుపతిరెడ్డి, పీఆర్‌జేఈ శర త్, ఏఈ శ్రీనివాస్, ఏపీవో లక్ష్మారెడ్డి, నాయకు లు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, గంగారెడ్డి, కండె ల భోజన్న, దండు సాయికృష్ణ పాల్గొన్నారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
నిర్మల్ అర్బన్, జూన్ 8 : నిర్మల్ పట్టణంలోని ఐఏ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. నిర్మల్ జిల్లా నుంచి 43 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని, వీరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే బక్రీద్ పండుగ వరకు ఈద్గా మంజూరయ్యే లా కృషి చేస్తానని హామీనిచ్చారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు నజీర్, టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు కలీం హైమద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
సోన్, జూన్ 8 : దేవాలయాల అభివృద్ధికి ప్ర భుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. మంత్రికి వేదపండితులు పూర్ణకుంభం, మహిళలు మంగళహారతులతో స్వాగ తం పలికారు. అనంతరం గ్రామంలోని గొర్రెలకు నులి పురుగుల నివారణ కోసం నట్టల మందు వే శారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి రమేశ్‌కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, నిర్మల్ మండల మాజీ కన్వీనర్ ముత్యంరెడ్డి, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, నాయకులు సూరపు సాయన్న, కుంట పద్మాకర్, రాములు, భీంరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.