ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేశారు. పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశువులకు ఉచితంగా మందు వేశారు. మందు వేయించడం వల్ల నట్టలు నిర్మూలించబడి, ఆరోగ్యంగా ఎదుగుతాయన్నారు. సకాలంలో ఎదకు రావడం, పాలు, మాంసం ఉత్పత్తి పెరుగుతుందని, రోగ నిరోధకశక్తి కూడా పెంపొందుతుంది.
తలమడుగు, జూన్ 8 : రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించాలని జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి సూచించారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో బుధవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆనంద్, మండల పశువైద్యాధికారి రాథోడ్ దూదూరాం, గొర్రెల సంఘం అధ్యక్షుడు మల్లయ్య, నాయకులు కల్యాణం రాజేశ్వర్, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 8 : రైతులు, పశువుల పెంపకం దారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయించాలని బోథ్ సర్పంచ్ సురేందర్‌యాదవ్ సూచించారు. మండల కేంద్రంలో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సుందర్, ఎంపీటీసీ మహేందర్, డాక్టర్ శ్రావణ్‌కుమార్, విశ్వనాథం, రమేశ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 8 : మండల కేంద్రంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ చౌహాన్ మహేందర్ గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో పశువైద్య సహాయకుడు అబ్దుల్ అల్తాఫ్, సిబ్బంది ప్రభాకర్, జితేందర్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జూన్ 8 : మండల కేంద్రంలో పశుసంవర్థక శాఖ ఏడీఏహెచ్ డాక్టర్ రాథోడ్ రామారావ్ గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులను ముందస్తుగా గ్రహించి ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులు అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, మండల పశువైద్యాధికారి రాథోడ్ జీవన్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జాదవ్ రమేశ్, రైతులు, పశువైద్య సిబ్బంది, పోషకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 8 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుతో సీజనల్ వ్యాధులు సోకవని జిల్లా పశుసంవర్థక శాఖ వైద్యాధికారి రంగారావ్ పేర్కొన్నారు. మండలంలోని మాదాపూర్, దుబార్‌పేట గ్రామాల్లో 775 గొర్రెలు, 145 మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రూపవత్ గోవింద్ నాయక్, పశువైద్య సహాయకురాలు సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 8 : నేరడిగొండలో పశువైద్య శిబిరాన్ని ఎంపీపీ రాథోడ్ సజన్ ప్రారంభించారు. మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పెంట వెంకటరమణ, ఎంపీటీసీ అంబేకర్ పండరి, డాక్టర్ సుశీల్‌కుమార్, వీఎల్వో విజయలక్ష్మి, అరుణ్, అనిత, సిబ్బంది గంగు, జంగు, సురేశ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, జూన్ 8 : మండల కేంద్రంలోని బోయవాడలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ మేకలకు నట్టల నివారణ మందు వేశారు, కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఏడీ కిషన్, డాక్టర్ రమేశ్, ప్రజ్ఞశీల్, రైతులు పాల్గొన్నారు..