e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఆదిలాబాద్ అధైర్య పడవద్దు.. అండగా ఉంటాం

అధైర్య పడవద్దు.. అండగా ఉంటాం

  • వరదబాధితులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • దిలావర్‌పూర్‌ మండలం కాల్వ గ్రామంలో పర్యటన
  • నిర్మల్‌లో రోడ్‌ స్వీపింగ్‌ మిషన్‌ ప్రారంభం

దిలావర్‌పూర్‌.జూలై27: వరదలతో నష్టపోయిన రైతులు అ ధైర్య పడవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర దేవాదాయ, న్యా య, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భరోసానిచ్చా రు. మండలంలోని కాల్వ గ్రామ పరిసర ప్రాంతాల్లో వర్షంతో నష్ట పోయిన రైతుల పంట పొలాలను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంటలు దె బ్బతిన్నాయని పేర్కొన్నారు. పంటలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు కూలిపోయినట్లు తెలిపారు. నష్టం వివరాలను అంచ నా వేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. రైతులందరినీ ఆదుకుంటామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకట్‌రామ్‌రెడ్డి, సారంగాపూర్‌ ఎంపీపీ, జడ్పీటీసీలు మహిపాల్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పీ అనిల్‌, ఆడెపు శ్రీనివాస్‌, కాల్వ ఆలయ చైర్మన్‌ చిన్నయ్య, ఒడ్నం కృష్ణ, బ్యాగరి శ్రీ నివాస్‌, స్వామి, తహసీల్దార్‌ హిమబిందు, ఏవో స్రవంతి, ఏ ఈవో శ్రీవాణి, పంచాయతీరాజ్‌ డీఈ తుకారాం, ఏఈ కృష్ణ, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నిర్మల్‌ అర్బన్‌, జూలై 27: మున్సిపాలిటీని అన్ని రంగాల్లో వే గంగా అభివృద్ధి పర్చి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పట్టణంలో రోడ్లు శుభ్ర పరి చేందుకు రూ.48 లక్షలతో కొత్తగా కొనుగోలు చేసిన స్వీపింగ్‌ యంత్రాన్ని మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి ప్రారంభించా రు. ముందుగా మంత్రి అల్లోలకు చైర్మన్‌ ఈశ్వర్‌ పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ వాహనం గం టకు 6 కిలో మీటర్ల వరకు రహదారులను శుభ్రం చేస్తుందని తె లిపారు. మున్సిపాలిటీలో ఇదివరకే ఒక వాహనం ఉండగా, మరొకటి తెప్పించామ ని చెప్పారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మరో డంప్‌ యార్డును 40-50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇటీవల వరదలతో నష్టపోయిన వారికి అండగా ఉంటామని చెప్పారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఏఈ వినయ్‌ కుమా ర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఆధ్యాత్మికతతోనే జ్ఞానామృతం
ఆధ్యాత్మిక భావనలతోనే జ్ఞానామృతం లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని మాదాపూర్‌ జీపీ పరిధి పట్వా రీ గూడలో నిర్మించిన ధ్యాన మందిరం, కల్యాణ మండపాన్ని మం గళవారం ఆయన ప్రారంభించారు. జీవితంలో ప్రేమ, దయ, కరుణ, త్యాగం, ధర్మ నిరతిని అలవర్చుకోవాలనీ సూచించారు. బోథ్‌ నియోజక వర్గంలో వివిధ గ్రామాల్లో రూ. పది కోట్ల నిధులతో కొత్తగా ఆలయాల నిర్మాణాలు, పురాతన ఆలయాలను పు నరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జ నార్దన్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌, డీసీసీబీ చైర్మన్‌ కాం బ్లే నాందేవ్‌, వైష్ణవి సధాన్‌ సంస్థ పీఠాధిపతి నారాయణ మహారాజ్‌, స్థానిక జడ్పీటీసీ కదం సుభద్రాబాయి, ఎంపీపీ ని మ్మల ప్రీతమ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఏనుగు కృష్ణారె డ్డి, ఆత్మ చైర్మన్‌ నరాల రవీందర్‌, ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌, నా యకులు సుభాష్‌ పాటిల్‌, ముస్తాఫా, లోక శిరీశ్‌ రెడ్డి, వెంకటేశ్‌, రాథోడ్‌ ప్రకాశ్‌, మేరాజ్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు కిన్నెర్ల మనోహర్‌ రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana