కుభీర్, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుభీర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.1.20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి మంగళవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మరమ్మతులు చేసిన అంగన్వాడీ కేంద్రం, ఉన్నత పాఠశాలలో ఓపెన్ జిమ్, విశ్వ్ బ్రాహ్మణ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అలాగే రూ.15 లక్షలతో చేపట్టిన గ్రంథాలయ భవనం, బీసీ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టిన ఇంటర్నల్ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మా ర్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శనగల కొనుగోళ్లను తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పా రు. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఆయనకు పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కందూర్ సంతోష్, వైస్ చైర్మన్ జాదవ్ దిగంబర్ పటేల్, జడ్పీటీసీ అల్కాతాయి చౌహాన్, సర్పంచ్ పానాజీ మీరా, సంజయ్ చౌహాన్, విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, ఎంపీటీసీ బంక పోసానిబాయి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెంచు రమేశ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రాములు మాస్టర్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నీల అనిల్, మాలేగాంవ్ సాయిరెడ్డి, నాయకులు సూది రాజన్న, గోనె కల్యాణ్, బొప్ప నాగలింగం, మార్కెటింగ్ శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని రూ.1.50 లక్షలతో మోడల్ అంగన్వాడీ కేంద్రంగా తీర్చిదిద్దగా, ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఆయనకు సర్పంచ్, జడ్పీటీసీ, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలుగా ఉన్న వారికి టీచర్లుగా గుర్తింపునివ్వడంతో పాటు వేతనాలను పెంచింది తెలంగాణ సర్కారేనని గుర్తుచేశారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, వారి గౌరవాన్ని పెంచిందన్నారు. మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
భైంసాటౌన్, ఏప్రిల్ 19 : పట్టణంలోని ఏపీ నగర్‌కు చెందిన ఏ సరస్వతికి రూ.34,500, తానూర్ మండలం బోసి గ్రామానికి చెందిన బీ శిరీషకు రూ.20 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ మంజూరవగా, వారికి ఎమ్మెల్యే చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. ప్రభుత్వం, పార్టీ నాయకత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బామ్ని రాజన్న, కిష్టయ్య, సచిన్ పటేల్ పాల్గొన్నారు.