
గుడిహత్నూర్, జనవరి 27 : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని వైజాపూర్ గ్రామంలో కుమ్రం భీం యూత్, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, తల్లిదండ్రుల ఆశయాలను వమ్ముచేయకుండా మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ రమేశ్‌బాబు, క్రీడాకారులు, యువత, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన కబడ్డీ పోటీలు
బజార్హత్నూర్, జనవరి 27: మండల కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామీణ కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో బజార్హత్నూర్, ఆదిలాబాద్, నేరడిగొండ, బోథ్ మండలాల నుంచి 50 జట్లు పాల్గొన్నాయి. ఆదిలాబాద్ – బజార్హత్నూర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కొనసాగింది. ఆదిలాబాద్ జట్టు ప్రథమ, బజార్హత్నూర్ జట్టు రెండో బహుమతి కైవసం చేసుకున్నాయి. జడ్పీటీసీ నర్సయ్య క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిల్కూరి భూమయ్య, కొత్త శంకర్, చట్ల వినిల్, గ్రామస్తులు, యువజన సంఘం సభ్యులు దీపక్, వికాస్, చందు, తదితరులు పాల్గొన్నారు.