పేరు : కోనేరు కోనప్ప, పుట్టిన తేదీ : 17-10-1955
చదువు : ఇంటర్మీడియట్, భార్య : రమాదేవి
పిల్లలు : ప్రతిమ, వంశీ కృష్ణ
రాజకీయ అనుభవం : 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు
2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం
2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014లో బీఎస్పీ నుంచి పోటీచేసి గెలుపొందారు. టీఆర్ఎస్లో చేరారు. 2019లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలుపొందారు
ప్రత్యేకతలు : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం
నిత్యాన్నదానం, విద్య, ఉద్యోగాల విషయంలో యువత, విద్యార్థులకు సేవలు అందించడం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పటిష్టమే ధ్యేయంగా ముందుకె ళ్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. టీఆర్ఎస్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకూ న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నా రు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేప పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. తనకు ఊహించని విధంగా జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.