ఎదులాపురం, ఫిబ్రవరి 22: చనాకా-కొరట బ్యారేజీ కెనాల్ పనులకు అవసరమైన భూ సేకరణ చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమావేశమై మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. చనకా -కొరట బ్యారే జీ కెనాల్ పనులు, లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పనులకు నీటీపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో అవసరమైన భూములను ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సేకరించి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రతిపాదనల నోటిఫికేషన్‌ను నిర్ణీత ప్రచురించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్వాసితులకు చెల్లింపులు చేయాలని సూచించారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, ఎస్ఈ రాము, ఈఈలు రవీందర్, విఠల్ రాథోడ్, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, భూ రికార్డుల సహాయ సంచాలకులు రాజేందర్ పాల్గొన్నారు.