నిర్మల్ టౌన్, మార్చి 29 : వడ్లు పండించిన రైతులపై కేంద్రం వివక్ష వీడాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి పేర్కొ న్నారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళ వారం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభు త్వం వరిధాన్యంపై కొర్రీలు పెట్టడం సమంజసం కాదన్నారు. వైస్ చైర్మన్ సురేందర్, డైరెక్టర్లు గంగా రాం, కైలాస్, కిమ్యానాయక్, రాథోడ్ రమేశ్, కొమ్ము గంగాధర్ పాల్గొన్నారు.
సోన్, మార్చి 29 : కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంజులాపూర్ పీఏసీఎస్ కార్యాలయంలో అత్యవసర సమావేశంలో తీర్మా నం చేశారు. ఆ కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపి స్తామని పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. వైస్ చైర్మన్ సాద విజయ్, డైరెక్టర్లు బర్మదాస్, మధుకర్‌రెడ్డి, తదితరులున్నారు.