బాసర, ఫిబ్రవరి 16 : బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం మాసపౌర్ణమి పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, వైదికులతో చతుర్వేద మంత్ర సహిత చండీ హోమంతో పాటు గణపతి పూజ, కలశస్థాపన, రక్ష బంధనం, మంపారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. ప్రజలు సుఖసంతోశాలతో మెలగాలని కోరుతూ రుత్వికులు మృత్యుంజయ మోమం, ధన్వంతరీ హోమం, రుద్ర హోమం, శాంతి సూక్త హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.