బెజ్జూర్, నవంబర్ 28 : అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మం డలం మరింత అభివృద్ధి చెందుతుందని ఎం పీపీ డోకె రోజా రమణి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలపై ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. అనంతరం ఏఈవో మారుతి మాట్లాడుతూ ఈ ఏ డాది 9 మంది రైతులు మరణించగా, ఏడుగు రు నామినీల ఖాతాల్లో రైతుబీమా డబ్బులు జమయ్యాయన్నారు. ఇరిగేషన్ డీఈ అజయ్ కుమార్ మాట్లాడుతూ సాగు నీటి కోసం మండలానికి ఆరు చెక్‌డ్యాములు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో నాగుల్వాయి రూ. 3.50 కోట్లు, ఊట్సారంగపల్లి రూ. 3.35 కో ట్లు, కుశ్నపల్లి రూ. 3.40 కోట్లు, తిక్కపల్లి రూ. 4.10 కోట్లు, కుకుడ రూ. 3.25 కోట్లు మొత్తం రూ. 21.20 కోట్లు మంజూరైనటు తెలిపారు. అదేవిధంగా పలు చెరువుల మరమ్మతుల కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించినట్లు తెలిపారు. ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నామన్నారు. ఇదిలాఉంటే కొన్నిచోట్ల పంపిణీ చేయడం లేదని అందుగుల గూడ సర్పంచ్ కుంరం హన్మంతు నిలదీశారు. ఏపీ వో చంద్రయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ కింద అవసరమైన పనులు చేపడుతున్నామన్నారు. పీహెచ్సీ పరిధిలో ఏఎన్సీ, పీఎన్సీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు హెచ్వీ రేణుకాదేవి తెలిపారు. ప్రస్తుతం హెచ్బీఎన్సీ ప్రారంభించామని వారం పాటు కొనసాగనున్నదని అలాగే ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంద్రం పుష్పలత, కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఇన్చార్జి ఎంపీడీవో రమేశ్ రెడ్డి, ఆర్ఐ అచ్యుత్ రావు, మిషన్ భగీరథ ఏఈ అభిలాష్, పంచాయత్ రాజ్ ఏఈ ముక్బుల్ హుస్సేన్, విదుత్య్ ఏఈ అంజన్ కుమార్, వైద్యాధికారి డాక్టర్ సంకన్న, ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్‌లు పాల్గొన్నారు.