తాండూర్, నవంబర్ 28 : జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు. తాండూర్ ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గజానంద్, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. తాండూర్ పంచాయతీ పరిధిలో అక్రమ కట్టడాలు జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదని, ఇబ్బందులుపడుతున్నామని మసీదుకాలనీ వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పలువురు తమ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకున్నారు. సంబంధిత శాఖల వారిగా పరిశీలన అనంతరం పరిష్కరించేందుకు కృషిచేస్తామని అధికారులు తెలిపారు.
కోటపల్లిలో..
కోటపల్లి, నవంబర్ 28 : కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మండల ప్రజలు వారి సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే భాస్కర్, ఎంపీవో అక్తర మోహియొద్దీన్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ బద్రినాథ్ స్వామి, ఏవో మహేందర్, ఏపీవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కాసిపేటలో..
కాసిపేట, నవంబర్ 28 : కాసిపేట ఎంపీడీవో కార్యాలయంలో న్విహించిన ప్రజావాణిలో అధికారులు అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
చెన్నూర్‌లో..
చెన్నూర్ టౌన్, నవంబర్ 28 : పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తామని ప్రత్యేకాధికారి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో గంగాభవాని, సీడీపీవో మనోరమ, ఐకేపీ ఏపీఎం ప్రమీల, ఎంపీవో అజ్మత్ అలీ పాల్గొన్నారు.
జైపూర్‌లో..
జైపూర్, నవంబర్ 28 : జైపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి, మంచిర్యాల డీఎల్పీవో ప్రభాకర్‌రావు హాజరై, సమీక్షించారు. ప్రజావాణిలో సమస్యలపై వినతిపత్రాలు అందించాలని డీఎల్పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.