ఎదులాపురం, మార్చి 10 : ప్రాథమిక స్థాయి పిల్లల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉన్నత స్థాయిలో బాలికా విద్య జీవన నైపుణ్యాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో గురువారం రీడ్ టూ రూమ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా, ఉన్నత స్థాయిలో బాలికా విద్య జీవిన నైపుణ్యాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని చదువులో వెనుకబడిన ప్రాథమికస్థాయి పాఠశాలలను గుర్తించి, ఎక్కువ మంది విద్యార్థులు గల పాఠశాలల్లో రీడ్ టూ రూమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో గ్రంథాలయం ఏర్పాటు, విద్యార్థులు పఠనా నైపుణ్యం పెంచేలా పోత్సాహం అందిస్తారన్నారు. ప్రతీ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి, రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ అంది స్తూ విద్యా ప్రమాణాలు మెరుగయ్యేలా కృషిచేయాలని చేయాలనీ సూచించారు. ఈ సమావేశం సెక్టోరల్ ఆధికారి నర్సయ్య, సంస్థ ప్రతనిధి నరసింహ చారి, లక్ష్మయ్య, రాంబాబు పాల్గొన్నారు.