ఉట్నూర్రూరల్, మార్చి 3 : ప్రజాసేవ చేయడం అదృష్టమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం గంగన్నపేటలోని సెయింట్ పాల్స్ పాఠశాలలో చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమంలో గురువారం ఆయన పేదలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం చేయడంలో ఉన్న సంతోషం దేనిలో దొరకదని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా రూ.51వేలు విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిషప్ ప్రిన్స్ అంథోని, విచారణ గురువులు ఫాదర్ టామ్ థామస్, ఫాదర్ రాజ్, ఫాదర్ ప్రతాప్, ఇంద్రవెల్లి విచారణ గురువు ఫాదర్ మత్తయి, సిస్టర్ దానా, నాయకులు మర్సుకోల తిరుపతి, రమేశ్, తిరుపతి, గంగారాం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.