ఎదులాపురం, మార్చి 3 : ఆధార్ సెంటర్ సర్వీసెస్ కోసం వచ్చే సిటిజన్స్ స్టాండర్డ్ ఫార్మాట్ ప్రతి ఆధార్ సెంటర్లో ఉన్న ఫార్మాట్లోనే నింపాలని రాష్ట్ర రీజనల్ అసిస్టెంట్ మేనేజర్ మొహమ్మద్ సౌభన్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(యూడై) ఆధ్వర్యంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ఆధార్ సెంటర్ ఆపరేటర్లకు శిక్షణ నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ ఫార్మాట్లో తేదీ, సంతకం, సీల్ సరిగ్గా ఉండే విధంగా చూడాలన్నారు. వారు ఇచ్చే పత్రాల్లో ఎటువంటి ఓవర్ రైటింగ్స్ , వైట్నర్ దిద్దుడం చేయవద్దని సూచించారు. కాన్సలేషన్, డూప్లికేట్ సమస్యలు నేరుగా ఆర్వో ఆఫీసు హైదరాబాద్‌లో సంప్రదించాలని కొరారు. పుట్టిన తేదీ మార్పులు కేవలం రెండు సార్లు మాత్రమే సెంటర్ వద్ద అవుతాయని తెలిపారు. అందులో ఏమైనా మార్పులు అవసరమైతే ఈ సమస్యను అమీర్‌పేట్ ఆఫీస్‌లో సవరించుకోవాలన్నారు. సిటిజన్స్ ప్రూఫ్ కోసం జతపరుస్తున్న పాన్‌కార్డు, కరెక్టా కదా అనేది పాన్ సర్వీసెస్ లింక్‌లో చెక్‌చేసి అప్లోడ్ చేయాలన్నారు. గెజిటెడ్ సంతకంలో తేదీ ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎం బండి రవి, టీఎస్ డీఎస్టీ డీఎం నరసింహరావు, ఆధార్ ఆపరేటర్లు భాస్కర్, అజహర్, ప్రసాద్, శిరీశ్ తదితరులు పాల్గొన్నారు.