కుంటాల, మార్చి 1: మండలంలోని వంజర్- వానల్పాడ్ ప్రధాన రహదారి బీటీ రెన్యూవల్‌కు నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ. కోటి 12 లక్షలు మంజూరయ్యాయి. నిధుల మంజూరుకు సంబంధించిన పత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన నివాసంలో మండల వాసులకు అందజేశారు. వానల్పాడ్ నుంచి లింబా వరకు బీటీ రె న్యూవల్ కోసం రూ. కోటి 12 లక్షలు మంజూరయ్యాయని ఇందుకు సంబంధించిన టెండరు ప్ర క్రియ త్వరలోనే పూర్తవుతుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. లింబా (బీ) నుంచి ఓల, కుం టాల, అంబకంటి, గొల్లమాడ, తిమ్మాపూర్ మీదు గా వంజర్ వరకు రహదారి మరమ్మతులకు నిధు లు మంజూరు చేయించామని ఎమ్మెల్యే తెలిపా రు. మండలంలో బీటీ రోడ్ల మరమ్మతుకు ఆర్అం డ్బీ శాఖకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. వంజర్ – వానల్పాడ్ బీటీ రోడ్డు రెన్యువల్ కోసం నిధులు మంజూరు చేయించిన మంత్రి అల్లోల, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ సత్యం గిరీశ్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.