ఎదులాపురం, ఏప్రిల్ 10: ప్రతి రోజూ యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ డే సందర్భంగా యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజలు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా ద్వారా శరీర దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 10 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నిర్మల్ జిల్లా డీఎంహెచ్వో రాజేందర్, జిల్లా ఆయుష్ అధికారి నారాయణరావు అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం ప్రపంచ హోమియో దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. అనంతరం రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాంప్రసాద్, సంతోష్, తిరుమల, స్వప్న, వైష్ణవి, శ్వేత, మనీషా, నిలోఫర్ అంజుమ్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డీ.శ్రావణ్, ఫార్మాసిస్టులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.