నిర్మల్ టౌన్, ఏప్రిల్ 17: పేద కుటుంబాల్లోని దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేశారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట ఎస్సీ కాలనీలో మోచీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సంఘ భవనానికి పది గుంటల స్థలం ఇచ్చామని, అదనంగా రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళిబంధు పథకం కింద రూ. 10 లక్షల సాయం అందిస్తున్నామన్నారు. పట్టణాల్లో త్వరలో ఈ పథకం అమలవుతుందని పేర్కొన్నారు. కులవృత్తిని నమ్ముకున్న మోచీ కుటుంబాలకు దళితబంధు పథకం ద్వారా ఆదుకుంటామన్నారు. మోచీ కుటుంబాలు చెప్పుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే స్థలంతో పాటు ప్రభుత్వం ద్వారా రుణం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ చీఫ్ విప్ వేణు, మోచీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి శంకర్ కృష్ణ, నాయకులు సాగర్, రాజేశ్వర్, మారుతి, భిక్షపతి, శ్రీనివాస్, సుధాకర్, రాజేందర్, పోశెట్టి, మేడారపు ప్రదీప్, నరహరి, రాజేశ్వర్, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు రాములు, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
పట్టణానికి చెందిన ప్రముఖ ఉర్దూ కవి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అన్సర్ అహ్మద్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ద్వారా రచించిన పుస్తకాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు టెట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గజేందర్, ప్రభాకర్, మేవా సంఘం నాయకులు వెంకటేశ్వర్రావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, అన్సర్, ముబిన్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌లోని దళిత అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభంకానున్న అంబేద్కర్ భవన నిర్మాణ ఆహ్వానపత్రికను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో అందించారు. మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.