Adilabad | తాంసి, మార్చి 11: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని యాసంగి పంటల పరిస్థితిని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రీధర్ స్వామి పరిశీలించారు. తాంసి (బి) గ్రామంలో పంటల పెరుగుదల, సాగునీటి లభ్యత, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పంటల నష్టతీవ్రతను తగ్గించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రైతులకు డీఏవో శ్రీధర్ స్వామి సూచించారు. నీటి వాడకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్రత్యామ్నాయ సాగు విధానాలు అవలంబించుకోవాలని తెలిపారు . అనంతరం ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్, ఏఈవో నిఖిత, రైతులు గంగారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.