ఎదులాపురం, ఫిబ్రవరి 28 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో త రగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందుకోసం 52 కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు.
పరీక్షల విధులకు సంబంధించి 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మం ది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 13 మంది సీ-కస్టోడియన్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ ద్వారా 144 సెక్షన్ అమలు చేస్తూ గట్టి బందోబస్తు ఏ ర్పాటు చేయాలని, అలాగే సమీపంలోని జి రాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా పత్రాల రవాణా, ఫ్లయింగ్ స్వాడ్స్ కో సం తగిన వాహనాలను సిద్ధం చేయాల ని రవాణా శాఖాధికారులను ఆదేశించా రు.
వేసవి తీవ్రతను దృష్ట్యా విద్యార్థుల కు ఇబ్బంది కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ పాల్గొన్నారు.